తెలంగాణ

Sweets: హైదరాబాద్ స్వీట్ షాపుల్లో వాంతులయ్యే నిజాలు!

Sweets: పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. నెయ్యి సువాసనలు వెదజల్లే రంగురంగుల మిఠాయిలను లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటాం. బ్రాండెడ్ షాపు కదా, వేల రూపాయలు పెట్టి కొంటున్నాం కదా అని గుడ్డిగా నమ్ముతుంటాం. కానీ ఆ మెరిసే ప్యాకింగ్‌ల వెనుక, ఆ ఘుమఘుమలాడే నెయ్యి వాసనల వెనుక ఎంతటి కాలకూట విషం దాగుందో తెలిస్తే కడుపులో తిప్పడం ఖాయం. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని పేరుమోసిన స్వీట్ దుకాణాలు, తయారీ కేంద్రాలు ప్రజారోగ్యంతో ఎంతలా చెలగాటమాడుతున్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో బట్టబయలైంది.ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జీడిమెట్ల, కూకట్‌పల్లి, మాసబ్‌ట్యాంక్, చందానగర్, బేగంబజార్ వంటి పలు ప్రాంతాల్లోని స్వీట్ తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించాయి. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులే విస్తుపోయారు.