స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. ఆ మంత్రి పీఆర్వో ఔట్? డబుల్ జీతం తీసుకున్నట్లు గుర్తింపు?..

ఏ ప్రభుత్వంలోనైనా కష్టపడి పని చేస్తేనే మంచి గుర్తింపు ఉంటుంది. కులాలు, మతాలు అంటూ ఎన్ని రోజులు నెట్టుకురాలేమని మరోసారి రుజువైంది. దక్షణ తెలంగాణలో ఓ మంత్రి వద్ద పని చేస్తున్న పీఆర్వో వ్యవహారంపై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ఇచ్చారు. ప్రత్యేక క్యాబిన్‌తో ఎవరికీ లేని విధంగా సకల సౌకర్యాలు కల్పించడంపై నిలదీశారు.

సదరు పీఆర్వో తాను చేస్తున్న ఉద్యోగానికి కనీస న్యాయం కూడా చేయలేదు. పైగా మంత్రి భార్య పేరు చెప్పుకొని మేడమ్‌తో అన్ని పనులు చేయిస్తానని పైరవీలు చేయడం గుర్తించారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను సైతం ఏకవచనంతో మాట్లాడటం, తోటి ఉద్యోగులను వేధించటం బహిరంగంగానే జరిగాయి. మహిళా ఉద్యోగుల ముందు వాటర్ బాటిల్స్ కాళ్ల మధ్యలో పెట్టుకుని ఆటలాడుతూ మాట్లాడేతత్వంతో చాలామంది ఉద్యోగులు చీదరించుకున్నారు.