తెలంగాణ
జస్టిస్ సూర్యకాంత్‌కు విద్యార్థుల సెగ.. ఇరకాటంలో నల్సార్ యాజమాన్యం!..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దంటూ నల్సార్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 450 మంది విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాసినట్లు సమాచారం. ఢిల్లీలో నీట్ నిరసనలపై విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు ఒకపూట భోజనం మానేసి నిరసన కూడా చేపట్టారు. డిమాండ్‌ను పట్టించుకోకపోతే స్నాతకోత్సవానికి ముందు నిరసన చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల టిస్ స్నాతకోత్సవం కూడా నిరసనల భయంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
