తెలంగాణ

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!..

గణేష్‌ నిమజ్జనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ద.మ. రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనం జరిగే రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రంతా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 25 నుంచి 27 వరకు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నడుస్తాయని సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ పేర్కొన్నారు.