తెలంగాణ
TG: సోమాజిగూడ బార్లో గన్ కలకలం.. కాల్చేస్తా అంటూ బెదిరింపులు
TG: హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి పూట తుపాకీతో ఒక యువకుడు చేసిన రచ్చ తీవ్ర కలకలం రేపింది. సోమాజిగూడలోని ఫేమస్ ‘హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్’లో ఈ సీన్ వెలుగు చూసింది. బార్లో తిని తాగిన తర్వాత బిల్లు కట్టడమే కాకుండా.. మళ్లీ లోపలికి వచ్చి ఆ కట్టిన బిల్లు డబ్బులను వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ గన్ తీసి బెదిరించడం అందరినీ షాక్కు గురిచేసింది.అసలేం జరిగిందంటే.. బార్లో బిల్లు కట్టే విషయంలో సిబ్బందితో మహమ్మద్ షానవాజ్ (24) అనే యువకుడు అర్ధరాత్రి వేళ గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. బయట పార్క్ చేసి ఉన్న తన థార్ కారు దగ్గరికి వెళ్లి అందులోంచి రివాల్వర్ బయటకు తీశాడు.
