తెలంగాణ

హైదరాబాద్ వాటర్‌పై సంచలన నివేదిక!!..

హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఈ ఏడాది వేసవిలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అసలే అంతంత మాత్రం ఉన్న నీటిలో ఇప్పుడు ప్రమాదకర విష వాయువులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ నీటిలో ప్రమాదకరంగా నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయిలు పెరిగినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ భూగర్భ జలాల్లో ఈ విష వాయువులు పెరగడం కారణంగా ముఖ్యంగా పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్త సంబంధిత వ్యాధులు, బర్త్ డిఫెక్ట్స్, ఎముకల బలం తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.