క్రైమ్

Hyderabad: శంషాబాద్‌లో కలకలం.. క్యాబ్‌లో మహిళకు చేదు అనుభవం!..

హైదరాబాద్ శివారులో క్యాబ్ డ్రైవర్ దారుణ యత్నం కలకలం రేపింది. గచ్చిబౌలికి చెందిన 35 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా.. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్ షార్ట్‌కట్ పేరుతో వాహనాన్ని సర్వీస్ రోడ్డువైపు మళ్లించాడు. కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కారును ఆపి, మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు నమోదైంది. భయంతో ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే సమయంలో ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదు బ్యాగ్‌ను తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.