తెలంగాణ

TG: 25న హైదరాబాద్ లో స్కూళ్లకు సెలవు

TG: మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి రంగం సిద్ధమైంది. వేలాదిగా తరలివచ్చే గణనాథుల శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు జనరల్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా భవిష్యత్తులో ఒక రెండో శనివారం సెలవును రద్దు చేసి వర్కింగ్ డేగా మార్చారు. వినాయక నిమజ్జనం రోజున నగరంలో భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు, జనసందోహం ఉండనున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 25న పూర్తిస్థాయిలో సెలవు వర్తిస్తుంది. బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఆ రోజున మూతపడనున్నాయి.