క్రైమ్
Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్‌లో స్కామ్.. యూజర్ ఛార్జీల అకౌంట్ నుండి కోట్ల ధనం గయాబ్!!..
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన యూజర్ ఛార్జీల ఖాతా నుంచి దాదాపు రూ.2.76 కోట్ల ప్రజాధనం అనుమానాస్పదంగా పక్కదారి పట్టిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నిధులను హైదరాబాద్ నగరంలోని ఓ ఖరీదైన ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలుకు వినియోగించారనే ఆరోపణలు తాజాగా పోలీసు వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత రెండు నెలల కాలంలో యూజర్ ఛార్జీల అకౌంట్ నుంచి "మహాకాల్ ఎంటర్‌ప్రైజెస్", "కేబీ ఎంటర్‌ప్రైజెస్" అనే రెండు ప్రైవేట్ ఏజెన్సీలకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి..
