క్రైమ్
అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీ షీట్ ఓపెన్!!..
అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఆయన బెదిరింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరోసారి అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. 2019లో శంకర్‌పై రౌడీషీట్ మూసివేశారు. తాజాగా రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవడంతో రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది.
