తెలంగాణ
TG: లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్.. హైదరాబాద్ పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో కలకలం!
TG: హైదరాబాద్ కవాడిగూడలోని పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆడవాళ్ల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు తీస్తున్న ఓ అటెండెంట్ బాగోతం తాజాగా బయటపడింది. వాష్‌బేసిన్ కింద పక్కాగా ఫోన్ దాచిపెట్టి దొరికిపోవడంతో ఆఫీస్‌లో పెద్ద రచ్చే జరిగింది.అక్టోబర్ 13న ఓ మహిళా ఉద్యోగిని వాష్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా.. వాష్‌బేసిన్ కింద ఏదో ఉన్నట్లు అనుమానం వచ్చింది. దగ్గరికెళ్లి చూస్తే డబుల్ సైడెడ్ టేప్‌తో అతికించి ఉన్న ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. వెంటనే ఆమె ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని బయటకు వచ్చి, అక్కడే ఉన్న ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ను "ఈ ఫోన్ ఎవరిది?" అని నిలదీసింది. తన నిర్వాకం బయటపడిందని తెలియగానే భరత్ ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని ఒక్కసారిగా పరుగెత్తాడు. మిగతా ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి ఆయనను పట్టుకున్నారు.
