తెలంగాణ
Power Crisis: ఖాళీ బిల్డింగుల షో.. హైదరాబాద్‌లో కరెంట్ కష్టాలు తప్పవా?
హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, తెల్లాపూర్, కోకాపేట నుంచి మొదలుకొని నగర శివార్ల దాకా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ నిర్మాణాల వెనుక జరుగుతున్న షో చూస్తుంటే.. భవిష్యత్తులో నగర ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పవా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎవరూ చేరని ఖాళీ బిల్డింగుల కోసం రాత్రంతా విచ్చలవిడిగా వందల యూనిట్ల విద్యుత్‌ను తగలబెడుతున్నారు.
