తెలంగాణ

TG: కాలం చెల్లిన ఏపీఐలను పీకేయండి: సీపీ సజ్జనార్

TG: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్‌లో లేని పాత ఏపీఐలను (Application Programming Interface), కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్లను తక్షణమే తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థల భద్రతా వ్యవస్థల్లోని లోపాలే నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. పాత ఏపీఐల గుండానే హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడుతున్నారని, వెంటనే వాటిని తొలగించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.సైబర్ ముఠాలు అత్యాధునిక ‘ఏఐ ఏజెంట్ల’ను ప్రయోగించి ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌లను జల్లెడ పడుతున్నాయని సీపీ వివరించారు. చాలా సంస్థలు పాత ఏపీఐ సర్వీసులను, అన్‌సెక్యూర్డ్ థర్డ్ పార్టీ మాడ్యూళ్లను అలాగే వదిలేస్తుండటంతో.. హ్యాకర్లు ఆ లోపాలను క్షణాల్లో పసిగడుతున్నారు.