తెలంగాణ

OYO Rooms: ఓయో రూముల్లో భయంకర ఘటనలు.. తస్మాత్ జాగ్రత్త!

OYO Rooms: ప్రైవసీ అనే ఒకే ఒక్క మాటను నమ్మి గది తలుపులు వేసుకుంటున్న యువతులకు, ఆ నాలుగు గోడలే సమాధులుగా మారుతున్న భయానక వాస్తవం ఇప్పుడు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒకప్పుడు ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాల్లో కలిసేవి.. కానీ నేడు ‘ప్రైవసీ’ ముసుగులో హోటల్ గదుల వైపు అడుగులు వేస్తున్నారు. తీరా ఆ తలుపులు మూసుకున్నాక ప్రేమ మాయమై, క్షణికావేశాలు, దురాశల రూపంలో మారణకాండ సాగుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు వేర్వేరు ఓయో హోటల్ గదుల్లో దారుణ హత్యకు గురికావడం రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది.నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు తేదీలు.. కానీ జరిగిన దారుణం మాత్రం ఒక్కటే. రక్తపు మడుగుల్లో ప్రాణాలు కోల్పోయిన యువతులు, తాళాలు వేసి పరారైన ప్రియుళ్లు. సెప్టెంబర్ 21, మాదాపూర్ సిద్దిఖీ నగర్ ఓయో రూమ్ నెంబర్ 303లో విశాఖకు చెందిన నికిత దారుణ హత్యకు గురైంది.