తెలంగాణ
వాహనదారులకు అలర్ట్.. ఈ రూట్ లో రెండేళ్ల పాటు తప్పని తిప్పలు!..
హైదరాబాద్‌లో కీలకమైన మార్గంలో ట్రాఫిక్ మార్పుకు రంగం సిద్ధమైంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, వాహనాల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 13 లేన్ ఛేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్‌తో పాటు స్పష్టమైన సైన్‌బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. మరోవైపు కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
