తెలంగాణ
టాక్సిక్ ఈవెంట్లో అపశృతి.. సంచలన కామెంట్స్ చేసిన మల్లారెడ్డి కోడలు!..
మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లడ్ లైట్ స్తంభం మీదపడి పలువురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం మన గ్రౌండ్లో జరగాలంటే మన బిహేవియర్ సరిగా ఉండాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే మళ్లీ మన క్యాంపస్లో ఇలాంటి కార్యక్రమం జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఈవెంట్స్ మళ్లీ జరగాలంటే మీరు ఫస్ట్ సరిగా ప్రవర్తించండి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
