క్రైమ్

బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టులు దగ్ధం!

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్‌ సెంటర్‌లోని సుమారు రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్‌ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.