తెలంగాణ

మెట్రో పాస్‌ల పై ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం!..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల చిరకాల డిమాండ్‌ అయిన రోజువారీ, నెలవారీ పాస్‌లపై మరోసారి చర్చ మొదలైంది. పాస్‌లను ప్రవేశపెట్టేందుకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ సానుకూలంగా లేకపోవడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. మెట్రో, ఆర్టీసీకి ఉమ్మడి టికెట్ లేదా పాస్‌ తీసుకొచ్చే అంశంపైనా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేటి హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.