తెలంగాణ

TG: లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే? రూట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌..

హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్క్ వద్ద అమలు చేస్తున్న 'వన్ వే' విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, అదే తరహాలో లక్డీకాపూల్‌లోనూ కొత్త వన్ వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ఇతర అధికారులతో కలిసి స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.