తెలంగాణ
బయటపడిన ప్రముఖ బేకరీ బాగోతం.. ఎక్స్‌పైరీ చికెన్‌తో వంటకాలు!..
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉన్న ప్రముఖ బేకరీ సంస్థ థియోబ్రోమా ఫూడ్స్ సెంట్రల్ కిచెన్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్స్పైర్ అయిన చికెన్ వింగ్స్ ను వండి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 24 కిలోల బంగాళాదుంపలు బూజుపట్టగా, 60 కిలోల చాక్లెట్ కలెట్స్ పాడైపోయి ఉండటంతో వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
