తెలంగాణ
హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్ 1, 2 లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని, పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు తెలిపారు. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇన్ని పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ఆయనను ప్రశ్నించింది.
