తెలంగాణ
అంజయ్య నగర్లో హైటెన్షన్.. ఆక్రమనిర్మాణం కూల్చివేతకు రంగం సిద్దం!..
గచ్చిబౌలి అంజయ్య నగర్లో మరో అక్రమ నిర్మాణంపై అధికారులు కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి భారీ బాహుబలి యంత్రం ఘటనా స్థలానికి చేరుకుంది. మరికొద్దిసేపట్లోనే కూల్చివేత పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
