తెలంగాణ

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచే ‘గ్రీన్ ట్యాంకర్లు’.. వివరాలివే!

TG: హైదరాబాద్ నగరంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ పరిధిలో నీటి వృథాను అరికట్టేందుకు రేపటి నుంచే (నవంబర్ 1) సరికొత్తగా ‘గ్రీన్ ట్యాంకర్లు’ అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కీలక మార్పులను వెల్లడించారు.భవన నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, క్లీనింగ్ వంటి తాగునీటితో సంబంధం లేని ఇతర అవసరాలకు ఇకపై స్వచ్ఛమైన తాగునీటిని వాడటానికి వీల్లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఇలాంటి పనుల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రాల (STPలు) ద్వారా వచ్చిన శుద్ధి చేసిన నీటినే అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు యూజ్ చేయాలని ఆదేశించారు.