తెలంగాణ

TG: మొత్తానికి దొరికిన గంజాయి లేడీ డాన్‌.. రెండేండ్లుగా ఎలా తప్పించుకుందంటే?

TG: హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను కేంద్రంగా చేసుకుని ఏకంగా తొమ్మిదేళ్లుగా మత్తు సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న గంజాయి లేడీ డాన్ ఎట్టకేలకు ఖాకీల వలలో చిక్కింది. నానక్‌రామ్‌గూడకు చెందిన 51 ఏళ్ల కలాపతి నీతూ బాయిని తెలంగాణ ఈగల్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా పట్టుకుంది. 30 కేసులు, అందులో 13 కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లతో వాంటెడ్‌గా ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి ఏకంగా రెండేళ్లుగా అజ్ఞాతంలో గడిపిన ఈ కిలాడీ మహిళ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కాలేజీ కుర్రాళ్లే టార్గెట్‌గా వేల కోట్ల విలువైన గంజాయి దందాను నడిపించిన ఈ మత్తు రాణి.. ఇన్నాళ్లూ పోలీసుల రాడార్ నుంచి ఎలా తప్పించుకుంది? ఆమె లగ్జరీ సామ్రాజ్యం ఎలా కూలిపోయిందనే అంశాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.