తెలంగాణ

క్యూర్‌ చట్టం పై కొత్త చర్చ.. స్థానిక సంస్థల అధికారాల సంగతేంటి?..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే.. పలు వివాదాస్పదమైన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటుంది. అందులో 22 A అంశం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ మారింది. అలాగే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) చట్టం కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూర్‌ చట్టం మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలకవర్గాల అధికారాలను కుదించేలా ఉందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం అధ్యక్షతన ఏర్పాటు కానున్న అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌, అధికారులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ద్వారా మేయర్‌, కార్పొరేషన్‌ పాలకవర్గాల నిర్ణయాధికారాలకు పరిమితులు ఏర్పడనున్నాయి.