తెలంగాణ
హైదరాబాద్‌కు నాలుగు కొత్త బస్ టెర్మినల్స్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్!..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి మరియు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి సిటీ నలువైపులా నాలుగు కొత్త ఆధునిక బస్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో నాలుగు కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు డిసైడ్ అయింది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సుల కోసం సుమారు 100 ఎకరాల్లో భారీ ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
