తెలంగాణ
Hyderabad: నగరంలో NRIల ఆస్తులే టార్గెట్ గా నకిలీ డాక్యుమెంట్ల రాకెట్ గుట్టురట్టు!..
నగరంలో నకిలీ డాక్యుమెంట్లతో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను కాజేస్తున్న ముఠాను తాజాగా స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్, ఎల్బీ నగర్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ముఠాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా నకిలీ స్టాంప్ పేపర్లతో పాటు స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
