తెలంగాణ

నకిలీ ఆస్తులు-కోట్ల రుణాలు.. వెలుగులోకి సబ్‌ రిజిస్ట్రార్ లీలలు!..

భారీస్థాయిలో ఆస్తులపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ మహ్మద్‌ యూసుఫ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పోలీసులకు చిక్కారు. లేని ఆస్తులు ఉన్నట్లుగా చూపించి బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న ముఠాతో చేతులు కలిపి రూ.4.11 కోట్లు మోసం చేసిన కేసులో కీసర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతంలో ఆయన కీసర సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఉనికిలోలేని 11 ఆస్తుల్ని కాగితాల్లో చూపించి రూ.4.11 కోట్ల రుణాల్ని వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. కొన్ని నెలలు రుణాలు కట్టి ఆ తర్వాత ఎగ్గొట్టేశారు. నకిలీ పత్రాలతో రుణాలు పొందినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.