తెలంగాణ
Hyderabad: నగరంలో మొదలైన దసరా సందడి.. ట్రాఫిక్ జామ్ తో నిండిపోయిన హైవేలు!!..
దసరా సందడి మొదలైంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వీరి రద్దీతో జాతీయ రహదారి-65పై వాహనాలు బారులు తీరాయి. లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్లో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి.
