తెలంగాణ
TG: ‘NO’ అని ఒక్క మెసేజ్ ఇస్తే చాలు.. బ్యాంక్ ఖాతా ఖాళీ: సీపీ సజ్జనార్
TG: ఓటీపీ ఎవరికీ చెప్పలేదు.. ఎలాంటి అనుమానాస్పద లింక్లపైనా క్లిక్ చేయలేదు.. అయినా సరే అకౌంట్లోని డబ్బులు క్షణాల్లో మాయమైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుంటూ కనివినీ ఎరుగని సరికొత్త దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. కేవలం వాట్సాప్లో 'NO' అని ఒకే ఒక్క రిప్లై ఇస్తే మీ ఖాతాలోని డబ్బంతా గోవిందా అంటున్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ సరికొత్త సైబర్ మాయాజాలంపై ఆయన 'ఎక్స్' వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు.సాధారణంగా బ్యాంక్ మోసాలు అంటే ఓటీపీలు అడగడం లేదా లింకులు పంపి క్లిక్ చేయించడం చూశాం. కానీ ఇక్కడ స్కెచ్ పూర్తిగా భిన్నం. గుర్తుతెలియని నంబర్ల నుంచి "మీ బ్యాంక్ ఖాతా నుంచి ఇంత నగదు కట్ అయ్యింది" అంటూ నకిలీ వాట్సాప్ మెసేజ్లు పంపుతున్నారు.
