తెలంగాణ
లైసెన్స్ సెక్షన్లో నగదు లెక్కలు.. బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా!..
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. హైదరాబాద్ బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. లైసెన్స్ జారీ సెక్షన్లో కానిస్టేబుల్ అరుణ్ పెద్ద మొత్తంలో 500 రూపాయల నోట్లను లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నా సామాన్యులను తిప్పుతున్నారని.. మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనులు వేగంగా పూర్తవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైరల్ వీడియోలోని నగదు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆరోపణల్లో నిజమెంత? సమగ్ర విచారణతోనే అసలు విషయం తేలాల్సి ఉంది.
