తెలంగాణ
గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..
హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ, మెట్రో రైలు సేవలను మరింత సులువుగా, ఒకే టికెట్ విధానంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాస్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఉమ్మడి పాస్‌ల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
