తెలంగాణ

బీసీల లెక్కలు తేలాల్సిందే.. జాతీయ జనగణనపై కొత్త డిమాండ్!..

బీసీ జనగణనపై తెలంగాణలో మరోసారి డిమాండ్ బలంగా వినిపించింది. జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి.. కులాల వారీగా సమగ్ర వివరాలు సేకరించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కోరారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2027 జనగణనలో ఖచ్చితమైన గణాంకాలు సేకరిస్తే.. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితుల ఆధారంగా విధానాలు రూపొందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి కోసం అన్ని పార్టీలు, బీసీ సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.