తెలంగాణ
హైదరాబాద్‌కు మరో మెగా బస్ టెర్మినల్!..
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇంటర్‌స్టేట్, సిటీ బస్సుల కోసం ప్రత్యేక టెర్మినల్స్‌తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు కానుంది.
ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల బస్సులు నగరంలోకి ప్రవేశించకుండా ఇక్కడి నుంచే సేవలు అందిస్తాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్‌పై ఒత్తిడి తగ్గి, హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
