తెలంగాణ
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక మలుపు!..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు పోలీసులు అతడిని విచారించనున్నారు. కేసులో కీలక అంశాలపై మరింత సమాచారం రాబట్టేందుకు ఈ కస్టడీని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి స్పెర్మ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్టైంది.
