తెలంగాణ

Hyderabad: రెవెన్యూలో కాసుల వేట-భూ సమస్యల పరిష్కారంలో 'రిపోర్ట్'ల పంచాయితీ!..

భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగీ తిరిగీ విసిగిపోయి చివరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్ల స్థాయి అధికారులే ఎక్కువగా ఏసీబీకి చిక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం భూ సమస్యల పరిష్కారంలో పైఅధికారుల పాత్ర చాలా కీలకం. భూభారతి లేదా ఇతర పోర్టళ్ల ద్వారా వచ్చిన దరఖాస్తులపై కింది స్థాయి అధికారులు పంపించే విచారణ నివేదికల (Reports) ఆధారంగానే ఆర్‌డీఓలు, అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ) జిల్లా కలెక్టర్లు ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారుల నిర్ణయానికి కింది స్థాయి అధికారుల రిపోర్టే కీలకం కావడంతో, కొంతమంది అధికారులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.