తెలంగాణ
Hyderabad: హైదరాబాద్ హోటళ్లలో దారుణ పరిస్థితులు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు!!..
హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనపై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం ప్రాంతాల్లో 10 ప్రత్యేక బృందాలు 20 ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా.. 9 చోట్ల తీవ్ర అపరిశుభ్రత బయటపడింది. దీంతో 9 హోటళ్ల లైసెన్సులను రద్దు చేసి.. వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. గెలాక్సీ కేఫ్, అంటెరా, లక్కీ రెస్టారెంట్, జాయింట్ ఆల్‌మండి, విజయ రాఘవేంద్ర హోటళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో మూడు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని టీజీ సేఫ్ హెచ్చరించింది.
