తెలంగాణ

Hyderabad:హైదరాబాద్‌పై "క్యూర్" ఫోకస్.. 70 ఏళ్ల తర్వాత కొత్త చట్టం!!..

హైదరాబాద్‌ నగర భవిష్యత్‌ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఫోకస్ పెట్టింది. 70 ఏళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూనే.. కోటి 30 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా ‘క్యూర్’ చట్టాన్ని తీసుకొచ్చింది. సీఎం చైర్మన్‌గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి.. పట్టణ అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. మరోవైపు, అన్ని కీలక శాఖల అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలను అమలు చేయనున్నారు. అంటే హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పట్టణాల అభివృద్ధిని ఒకే సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం.