తెలంగాణ
Hyderabad:పేదల సొంతింటి కలను నిజం చేయనున్న ఇందిరమ్మ టవర్స్.. 15 నియోజకవర్గాల్లో పూర్తి అయిన టెండర్ ప్రక్రియ!..
హైదరాబాద్ నగర పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు టెండర్ ప్రక్రియ పూర్తవగా.. 40,900 మంది అర్హులను గుర్తించారు. ఈ నెల 27 నుంచి 30 వరకు అర్హుల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎంపిక కాని వారికి 10 వేల రూపాయల ఈఎండీని తిరిగి చెల్లించనున్నారు. మరో నాలుగు నియోజకవర్గాల్లో 1,920 ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు ఆహ్వానించారు. సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేద కుటుంబాలకు విలువైన భూమితో పాటు సొంతింటిని అందించడమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు.
