తెలంగాణ
Hyderabad: చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు చేసిన అధికారులు.. 100 టన్నులు సీజ్!..
సైబరాబాద్లో చికెన్ వ్యర్థాల మాఫియా గుట్టురట్టైంది. పోలీసులు, వెటర్నరీ అధికారులు కలిసి అత్తాపూర్, మియాపూర్, అమీన్పూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళల్లో వ్యర్థాలను లారీల్లో తరలించి, ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు ఆరోగ్యానికి హానికరమని, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైనా దందా కొనసాగడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
