తెలంగాణ

నెలలో ఖాళీ కానున్న హైదరాబాద్ నీళ్లు.. సర్కార్ వద్ద ప్లాన్ బి ఉందా?

రాష్ట్రంలో వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నీటి కొరతతో గ్రామాల్లోని ప్రజలు అల్లాడుతున్నట్టు సమాచారం. మరోవైపు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామాలు, పల్లెల్లో కూడా నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.దీనంతటికి ఎల్ నినో ప్రభావమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.ఇదిలాఉండగా, హైదరాబాద్‌లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. సమ్మర్ ఎఫెక్ట్ ఇప్పుడే తెలుస్తోంది. శీతాకాలంలో వేసవి మాదిరిగా ఎండలు దంచికొడుతుండటంతో జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. తాజాగా రిపోర్టుల ప్రకారం హైదరాబాద్‌లోని ప్రాజెక్టుల్లో డిసెంబర్ వరకే నీరు ఉందని తెలుస్తోంది.