తెలంగాణ

HyD : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. 31 వరకు హై సెక్యూరిటీ!

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.ఇండిపెండెన్స్ రోజున ఉగ్రదాడులు జరిగే ఆస్కారముందని నిఘా వర్గాల హెచ్చరికల మేరకు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి. అక్కడ అధికంగా భద్రతా బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్‌ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో 'హై అలర్ట్' ప్రకటించారు.