తెలంగాణ

విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..

హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.. బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.. ఇక స్థానికుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 2426 ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ కు 54 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుంది. అయితే ఇటీవల హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పనులు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ హరీష్ సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన తర్వాత వచ్చిన మూలమలుపు వద్ద బస్సును టర్న్ చేస్తున్న క్రమంలో స్టీరింగ్ విరినట్టు సమాచారం.. దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.