క్రైమ్

నల్లగా ఉన్నావని భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?

దాంపత్య జీవితంలో వేధింపులు, అవమానాలు తాళలేక మరో వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన నాటి నుంచి అటు భర్త అండగా లేకపోవడంతో పాటు పదే పదే రంగు గురించి అవహేళన చేయడం, అవమానించడం, అత్తమామలు సైతం కేర్ చేయకపోవడంతో ఆ వివాహిత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకివెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తితో రుచి మిశ్రాకు వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచి నల్లగా ఉన్నావని ఆమె భర్త వేధింపులకు గురిచేయసాగాడు.దీనికి తోడు వరకట్న వేధింపులకు సైతం గురిచేసినట్టు సమాచారం.మొదటి నుంచి భర్త వ్యవహారం, అత్తింటి వారి వేధింపులను ఓపికగా భర్తిస్తూ వచ్చిన రుచి... టార్చర్ ఎక్కువ కావడంతో అత్తింటిలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.