వైరల్ న్యూస్

ప్రేమతో హగ్ ఇచ్చిన భర్త.. విరిగిన పక్కటెముకలు!

ఓ భర్త తన భార్యను ప్రేమగా కౌగిలించుకోగా ఆమె పక్కటెముకలు విరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో అక్టోబర్ 18న చోటుచేసుకున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తన భార్యపై ఉన్న ప్రేమను తెలియజేసేందుకు ఆ భర్త ఆమెను దగ్గరకు తీసుకుని గట్టిగా హగ్ చేసుకుని పైకి లేపాడు. ఆ సమయంలో టక్ మని శబ్దం రావడంతో పాటు ఆమెకు తీవ్రమైన వెన్నునొప్పి ఏర్పడింది. బాధితురాలు నిటారుగా నిలబడలేనంత తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో తన భార్యను ఆసుప‌త్రికి తరలించాడు. వైద్యులు సిటీ స్కానింగ్ చేసి చూడగా 5 పక్కటెముకలు విరిగాయని, మరొక దానికి క్రాక్ వచ్చినట్లు చెప్పారు.డాక్టర్ల మాట విన్న భర్త‌కు నోట్లో నుంచి మాట రాలేదని తెలిసింది. హగ్ చేసుకుంటే ఎముకలు విరగడం ఏంటని ఆ భర్త షాక్‌లో ఉండిపోయాడు.