భార్య ముక్కు కొరికిన భర్త.. దీనివెనుక ఇంత స్టోరీ నడిచిందా?
దంపతులు గొడవ పడిన ఘటనలో భర్త భార్య ముక్కు కొరికాడని ఓ వార్త వైరల్ అయ్యింది.అయితే, దానివెనుక పెద్ద స్టోరీ ఉందని తాజాగా వెలుగుచూసింది. భార్య భర్తల మధ్య గొడవకు మనస్పర్దలు కారణం కావని..భార్య వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. భర్తను కాదని ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో వెళ్లిన భార్య.. మరల పిల్లల కోసం దొంగతనంగా ఇంట్లోకి చొరబడటంతో ఇద్దరి మధ్య తగవులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే భర్త.. భార్య ముక్కు కొరికినట్టు తెలుస్తుండగా.. బాధితురాలు మాత్రం మరో విధంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయి జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకివెళితే.. సాధన(27), దీపక్ భార్యాభర్తలు..వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపక్ ఫ్రెండ్‌తో సాధన వివాహేతర సంబంధం పెట్టుకొని, రెండున్నర నెలల క్రితం అతనితో వెళ్లిపోయింది.
