National

జియో ఐపీవోకు భారీ స్పందన.. 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఇవాళ పబ్లిక్ ఇష్యూకు రాగా, మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. రూ. 30,213 కోట్ల విలువైన ఈ భారీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డును సృష్టించింది.క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపించారు. ఐపీఓ ప్రారంభమైన ఉదయం 10 గంటల సమయానికే QIB కోటా 2.86 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఆ తర్వాత అది 3.68 రెట్లకు పైగా దూసుకెళ్లింది. సాధారణ రిటైల్ మదుపరుల నుంచి మొదటి రోజు ఉదయం స్పందన కాస్త నెమ్మదిగా ఉన్నట్టు తెలిసింది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే (అక్టోబర్ 19న) యాంకర్ ఇన్వెస్టర్ల బుక్ కోసం ఏకంగా రూ. 2.5 లక్షల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చేసిన దానికంటే దాని విలువ 30 రెట్లు ఎక్కువ.