International

శాంసంగ్ ఉద్యోగులకు బిగ్ షాక్..

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. భారీగా ఉద్యోగాల కోత ప్రకటించింది. యూఎస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఉద్యోగాలను తగ్గించింది శాంసంగ్. దీని వల్ల డిస్‌ప్లే, మొబైల్ ఫోన్, ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలోని ఉద్యోగులపై ఎఫెక్ట్ పడింది. ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా న్యూజెర్సీ, టెక్సాస్‌లోని ఉద్యోగులను ప్రభావితం చేశాయి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.