వైరల్ న్యూస్

నగరంలో పేలుడు.. పరుగులు తీసిన జనాలు (వీడియో)

నగరంలో రోడ్డు పక్కన బెలూన్లు అమ్మే వ్యక్తి వద్దనున్న సిలిండర్ ఒక్కసారిగా పేలింది. మియాపూర్ పీఎస్ పరిధిలోని మదీనాగూడలో ఈ ఘటన జరింది. స్థానికంగా గల జీఎస్ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపి ఓ వ్యక్తి విక్రయిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగే సదరు వ్యక్తి బెలూన్లలో గాలి నింపుతుండగా.. ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది.ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అవ్వ్గా.. ప్రకాశ్ పాల్ అనే వ్యక్తికి సగం కాలు విరిగినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం బెలూన్లు విక్రయిస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరార్ అయినట్టు సమాచారం.