తెలంగాణ

పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. 22 ఏ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కార్నర్ చేశారు. ప్రజలు, రైతులకు చెందిన పట్టా భూములను నిషేధితా జాబితాలో ఎందుకు పెట్టారు? వాటిని విడిపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, కమీషన్ల కోసమే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఈ దందాకు తెరలేపారని మాజీ మంత్రి ఆరోపించారు. అయితే, హరీశ్ రావు వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదవులు, డబ్బుల కోసమే మాజీ మంత్రి హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారి రాజకీయం చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. బీఆర్ఎస్‌ను కబ్జా చేసేందుకు హరీశ్ రావు మరింతగా దిగజారారని ఫైర్ అయ్యారు. మామ కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడదని క్షుద్రపూజలు చేయించారని, ఈ విషయం స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ప్రకటించారని, దీనిని బట్టి హరీష్ వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చని ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయ్యారు.